: రికార్డు సృష్టించిన సంజయ్ దత్


మరికొద్ది రోజుల్లో జైలుకు చేరనున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ రికార్డు సృష్టించారు. ముంబయి వరుస పేలుళ్ళ కేసులో సంజయ్ దత్ కు సుప్రీం ఐదేళ్ళు జైలుశిక్ష విధించిన నేపథ్యంలో ఆయన ఏప్రిల్ 18న పోలీసుల ముందు లొంగిపోవాల్సి ఉంది. అయితే, అంగీకరించిన చిత్రాలను పూర్తి చేయాలన్న సంజయ్ దత్ విన్నపాన్ని మన్నించిన సుప్రీం లొంగిపోయేందుకు ఆయనకు నాలుగు వారాల గడువు పొడిగించింది. దీంతో, సంజయ్ దత్ తన చిత్రాలను పూర్తి చేసేందుకు నిర్విరామంగా శ్రమిస్తున్నారు.

పగలంతా షూటింగ్ లో పాల్గొనడం, రాత్రి డబ్బింగ్ చెప్పడం.. కొన్నాళ్ళుగా సంజయ్ దత్ దినచర్య ఇలా సాగుతోంది. కాగా, తాజాగా 'పోలీస్ గిరి' అనే చిత్రానికి సంజయ్ దత్ కేవలం 3 గంటల్లో తన పాత్ర మొత్తానికి డబ్బింగ్ చెప్పి ప్రపంచ రికార్డు సృష్టించాడట. ఈ విషయమై చిత్ర నిర్మాత రాహుల్ అగర్వాల్ మాట్లాడుతూ, సంజయ్ దత్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. సంజూలాగా పాత్ర మొత్తానికి మూడు గంటల్లో డబ్బింగ్ చెప్పడం మరెవరికైనా అసాధ్యమని అన్నాడు. ఇదిలావుంటే, రామ్ చరణ్ తొలి హిందీ చిత్రం 'జంజీర్' లోనూ సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News