: పంజాబ్ కింగ్స్ కు చివరి అవకాశం
ఐపీఎల్-6లో ప్లే ఆఫ్ దశకు చేరాలంటే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఇక నుంచి ప్రతి మ్యాచ్ నెగ్గాల్సి ఉంటుంది. ఇప్పటివరకు పంజాబ్ 11 మ్యాచ్ లాడి 5 విజయాలు, 6 ఓటములు నమోదు చేసింది. ఇక ఆ జట్టుకు మరో 5 మ్యాచ్ లు మాత్రమే మిగిలున్నాయి. ప్రతి పోరు చావోరేవో అన్న నేపథ్యంలో నేడు పంజాబ్ కింగ్స్ స్వంత మైదానం మొహాలీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. మ్యాచ్ మరికాసేపట్లో మొదలవుతుంది.
రాత్రి ఎనిమిదింటికి మొదలయ్యే మరో మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తో పుణే వారియర్స్ పోటీ పడనున్నారు. ఈ మ్యాచ్ కు పుణే వేదిక. కాగా, బుధవారం రాత్రి ఉప్పల్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ చిత్తుగా ఓడింది. స్వంతమైదానంలో చెన్నై చేతిలో 77 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఓటమిపాలైంది.