kanna babu: కన్నబాబుతో గంటా మంతనాలు.. బుజ్జగించే పనుల్లో టీడీపీ

  • టీడీపీలోనే ఉండాలని కోరిన మంత్రి గంటా
  • టీడీపీలో తనకు గౌరవం లేదన్న కన్నబాబు
  • పార్టీని వీడుతానంటూ స్పష్టీకరణ

విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు టీడీపీకి గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను వైసీపీలో చేరుతున్నానని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ఆయనను బుజ్జగించే ప్రయత్నాలను టీడీపీ చేపట్టింది. ఇందులో భాగంగా కన్నబాబుతో మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలని కోరారు. అయితే, టీడీపీలో తనకు గౌరవం ఇవ్వడం లేదని... అందుకే పార్టీ మారాలనుకుంటున్నానని ఆయన మరోసారి స్పష్టం చేసినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News