: బాబు రాక కోసం తిరుపతి తమ్ముళ్ళ ఎదురుచూపులు


చంద్రబాబు నాయుడు ఎల్లుండి ఉదయం తిరుమల వెంకన్న దర్శనం చేసుకోనున్నారు. రేపు సాయంత్రం తిరుపతి చేరుకోనున్న బాబు అక్కణ్ణించి నేరుగా తిరుమల వెళతారు. కాగా, 'వస్తున్నా...' పాదయాత్ర ముగిసిన తర్వాత బాబు తిరుపతి రానుండడం ఇదే తొలిసారి కావడం.. సుదీర్ఘ విరామం తర్వాత సొంత జిల్లాలో అడుగుపెడుతుండడం పట్ల టీడీపీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి అలిపిరి వరకు పెద్ద ఎత్తున స్కూటర్ ర్యాలీ నిర్వహించాలని పార్టీ శ్రేణులు నిర్ణయించాయి.

  • Loading...

More Telugu News