tarunbhaskar: ఇలాంటి ఇంటర్వెల్ బ్యాంగ్ ఏ తెలుగు సినిమాలోనూ లేదట!
- తరుణ్ భాస్కర్ తాజా చిత్రం పూర్తి
- టైటిల్ గా 'ఈ నగరానికి ఏమైంది'
- స్పెషల్ షో చూసినవారి ప్రశంసలు
దర్శకుడు తరుణ్ భాస్కర్ పేరు వినగానే అందరికీ 'పెళ్లి చూపులు' సినిమా గుర్తుకువస్తుంది. థియేటర్లలో ఆ సినిమా చేసిన సందడి కళ్లముందు కదలాడుతుంది. అలా తొలి సినిమాతోనే దర్శకుడిగా తన సత్తా చాటుకున్న తరుణ్ భాస్కర్, 'ఈ నగరానికి ఏమైంది' అనే టైటిల్ తో మరో సినిమాను రూపొందించాడు. విశ్వక్ .. అనీషా ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు.
ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖులకు ఆయన ఈ సినిమా స్పెషల్ షో వేసి చూపించాడట. చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా తీశావని అంటున్నారట. కథాకథనాలను నడిపించిన తీరు ఎంతో ఆసక్తికరంగా ఉందనీ, ఇలాంటి ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంతవరకూ ఏ తెలుగు సినిమాలోను చూడలేదని అంటున్నారట. ఈ ఫీడ్ బ్యాక్ తో ఈ సినిమా సక్సెస్ పై తరుణ్ భాస్కర్ మరింత నమ్మకంతో వున్నాడని అంటున్నారు .