Jagan: చంద్రబాబు తీరుని విమర్శిస్తూ జగన్ ట్వీట్‌

  • బీసీలపై చంద్రబాబు తీరు బాగోలేదు
  • జాతీయ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ ఈ విషయాన్ని బయట పెట్టారు
  • బీసీ న్యాయవాదులు జడ్జిలు కాకుండా చంద్రబాబు అడ్డు

బీసీలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తీరును జాతీయ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య తాజాగా బయట పెట్టారని వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి ట్వీట్ చేశారు. బీసీల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పుకునే చంద్రబాబు నాయుడు బీసీ న్యాయవాదులను జడ్జిలు కాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని జగన్ ప్రశ్నించారు.

వారి నియామకాలను అడ్డుకునే విధంగా తప్పుడు ఫీడ్‌బ్యాక్‌ ఎందుకు ఇస్తున్నారని జగన్‌ నిలదీశారు. కాగా, గతంలో హైకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం ఇద్దరు బీసీల పేర్లు తెరపైకి రాగా వారిపై పలు ఆరోపణలు చేస్తూ గతేడాది మార్చి 21న చంద్రబాబు.. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు తప్పుడు నివేదిక పంపించారని  హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జాతీయ బీసీ కమిషన్‌ చైర్మన్‌ ఈశ్వరయ్య అన్నారు.

కాగా, హైకోర్టు న్యాయమూర్తుల కోసం సదరు ఇద్దరు బీసీలతో పాటు ఎస్సీ వర్గానికి చెందిన గంగారావు, బ్రాహ్మణ కులానికి చెందిన డీవీ సోమయాజులు, కమ్మ కులానికి చెందిన విజయలక్ష్మి, వెలమ కులానికి చెందిన కేశవరావును సిఫార్సు చేస్తే వారిలో అమర్‌నాథ్‌ గౌడ్, అభినవ కుమార్, గంగారావు, డీవీ సోమయాజులపై చంద్రబాబు పలు ఆరోపణలు చేస్తూ కేంద్ర మంత్రులకి లేఖలు రాశారని ఇటీవల ఈశ్వరయ్య మీడియాకు వివరించారు. 

  • Loading...

More Telugu News