Jagan: జగన్ అప్పటి నుంచే సీఎం కావాలని కలవరించి ఉంటాడు : ఎంపీ జేసీ
- జగన్ తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే అలా కలవరించి ఉంటాడు
- పవన్ కల్యాణ్ కూడా సీఎం కావాలనే కలలు కంటున్నారు!
- వీళ్లిద్దరి కలలు నెరవేరవు
వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన దైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ తన తల్లి విజయమ్మ గర్భంలో ఉన్నప్పుడే ‘ముఖ్యమంత్రిని కావాలి’ అని కలవరించి ఉంటాడని చమత్కరించారు. అదేవిధంగా, పవన్ కల్యాణ్ కూడా ముఖ్యమంత్రి కావాలనే కలలు కంటున్నారని, వాళ్లిద్దరి కలలు నెరవేరవని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పై జేసీ విమర్శలు చేశారు. నాడు సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న నరసింహన్, నేడు ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడిగా మారిపోయారని వ్యాఖ్యనించారు.