governor narasimhan: విజయవాడలో గవర్నర్ తో భేటీ అయిన సీఎం చంద్రబాబు

- గేట్ వే హోట ల్ లో నరసింహన్ ని కలిసిన చంద్రబాబు
- పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించిన బాబు
- తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్టు సమాచారం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. విజయవాడలోని గేట్ వే హోట ల్ లో నరసింహన్ ని కలిసిన చంద్రబాబు ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీలు, కేంద్రం వైఖరిపై చర్చిస్తారని తెలుస్తోంది. సుమారు అరగంట నుంచి వారి సమావేశం కొనసాగుతోంది. కాగా, విశాఖపట్టణంలో పర్యటించిన నరసింహన్ నిన్న రాత్రి విజయవాడ చేరుకున్నారు.