: కర్ణాటకలో నేను లేని బీజేపీ లేదు: యడ్డి


కర్ణాటకలో బీజేపీ ఓటమికి బాధ్యత తనదేనని మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక జనతాపార్టీ నేత యడ్యూరప్ప గర్వంగా ప్రకటించారు. మళ్లీ బీజేపీలోకి పోనన్నారు. కర్ణాటకలో తాను లేకుండా బీజేపీ లేదని అభివర్ణించారు. బీజేపీలోకి రండంటూ ఆ పార్టీ నేతలు తనను కోరరని ఆశిస్తున్నానన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ కు గెలుపు తనవల్లే వచ్చిందని, బీజేపీ ఓటు బ్యాంకు చీల్చడమే అందుకు కారణమని చెప్పారు. తన పార్టీ చతికిలబడడంపై యడ్డీ దిగాలు పడలేదు. తొలిసారే 10 శాతం ఓట్లు సాధించామని గర్వంగా చెప్పారు.

  • Loading...

More Telugu News