: అంజలి విషయంలో నాకు బెదిరింపులు: కలంజియం


తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ నిన్న సినీనటి అంజలి పిన్ని భారతీదేవి, నేడు దర్శకుడు కలంజియం పోలీసులను ఆశ్రయించారు. అంజలిపై కేసును వెనక్కి తీసుకోవాలని తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ దర్శకుడు కలంజియం ఈ ఉదయం చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, చెన్నై వదలి వెళ్లకుంటే చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అంజలి పిన్ని భారతీ దేవి నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ లోగడ సినీనటి అంజలి అదృశ్యం సమయంలో ఆమెపై ఫిర్యాదు చేసి ఉన్నారు.

  • Loading...

More Telugu News