Andhra Pradesh: ధర్మపోరాట దీక్ష విరమించిన చంద్రబాబునాయుడు!

  • చంద్రబాబుకు నిమ్మరసం ఇచ్చిన ఇద్దరు చిన్నారులు
  • పన్నెండు గంటల పాటు కొనసాగిన దీక్ష  
  • చంద్రబాబును అభినందించిన నేతలు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ధర్మపోరాట దీక్షను విరమించారు. ఇద్దరు చిన్నారులు చంద్రబాబుకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని పలువురు నేతలు అభినందించారు. 68 ఏళ్ల వయసులో 12 గంటల పాటు నిర్విరామ దీక్ష చేసిన చంద్రబాబు కనీసం చుక్కనీరు కూడా తాగలేదు.. కూర్చున్న చోటు నుంచి కదల్లేదు. చెరగని చిరునవ్వుతో ఉన్న చంద్రబాబు తనకు మద్దతు తెలిపిన వారిని ఆప్యాయంగా పలకరించారు.

కాగా, విజయవాడ మున్సిపల్ మైదానంలో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పన్నెండు గంటల పాటు చంద్రబాబు దీక్ష కొనసాగింది. చంద్రబాబు దీక్షకు మద్దతుగా 13 జిల్లాల్లోనూ మంత్రులు దీక్షలు చేపట్టారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై సమర శంఖం పూరించిన చంద్రబాబు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో దీక్షకు కూర్చున్నారు. 

  • Loading...

More Telugu News