Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ!
- కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసన
- రేపు దీక్ష చేస్తున్నాను
- రైల్వే జోన్ ఇవ్వడం లేదు
- ఉక్కు కర్మాగారం లాభసాటి కాదన్నారు
ధర్మ పోరాట దీక్షపై ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. కేంద్ర సర్కారు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, వంచనకు వ్యతిరేకంగా సత్యాగ్రహ దీక్ష చేస్తున్నానని చెప్పారు. హోదా, విభజన హామీల సాధనకు పోరాటాన్ని ఉద్ధృతం చేయాల్సిన సమయం ఇది అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చివరి బడ్జెట్‌లోనూ రాష్ట్రానికి అన్యాయమే చేసిందని పేర్కొన్నారు.
విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రైల్వే జోన్ ఇవ్వడం కుదరదంటున్నారని, ఉక్కు కర్మాగారం లాభసాటి కాదంటున్నారని, ఓడరేవుకు కూడా అభ్యంతరాలు చెబుతున్నారని, యూసీలు ఇచ్చినప్పటికీ ఇవ్వలేదని చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు.