nithin: 'చండీఘర్' లో నితిన్ షూటింగ్ సందడి!

  • దిల్ రాజు నిర్మాతగా 'శ్రీనివాస కల్యాణం'
  • నితిన్ సరసన రాశి ఖన్నా 
  • చండీఘర్ లో నేటి నుంచి షెడ్యూల్ 

తెలుగులో మాంచి దూకుడు మీద కనిపించే కథానాయకులలో నితిన్ ఒకరు. ఆ మధ్య ఆయన చేసిన 'లై' పరాజయం పాలైంది. ఇక ఇటీవల థియేటర్స్ కి వచ్చిన 'ఛల్ మోహన్ రంగ ' సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. అయినా నితిన్ డీలాపడిపోకుండా తన తదుపరి ప్రాజెక్టుపై దృష్టి పెట్టాడు.

ప్రస్తుతం ఆయన దిల్ రాజు నిర్మాణంలో .. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కల్యాణం' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన సరసన రాశి ఖన్నా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. రెండవ షెడ్యూల్ ఈ రోజు ఉదయం 'చండీఘర్' లో మొదలైంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్నిముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు తీసిన సెల్ఫీనే ఇది.   

More Telugu News