: ముందుంది ముసళ్ల పండగ
కర్ణాటకలో విజయంతో ఉప్పొంగిపోతున్న కాంగ్రెస్ పార్టీకి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ చురకలంటించారు. ఒక విజయం వచ్చే సార్వత్రిక ఎన్నికలకు గీటురాయి కాదన్నారు. కర్ణాటకలో విజయం ఆధారంగా ఎటువంటి అంచనాలకు రాకండని హితవు పలికారు. త్వరలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికలు కేంద్రంలోని యూపీఏ సర్కారుకు పెద్ద సవాల్ గా పేర్కొన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ యూపీఏలో భాగస్వామ్యపక్షంగా ఉన్న సంగతి తెలిసిందే.