Chandrababu: కతువా, ఉన్నావో దుర్ఘటనలపై స్పందించిన చంద్రబాబు!

  • కతువా, ఉన్నావో దుర్ఘటనలపై దేశవ్యాప్తంగా ఆందోళన
  • ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి
  • ట్వీట్ చేసిన చంద్రబాబు

కతువా, ఉన్నావో ఘటనల బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దేశంలో పలుచోట్ల వేల మంది ఆందోళనకారులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ దుర్ఘటనలు మానవత్వానికే మాయని మచ్చ అని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా స్పందించారు. అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన వారు ఏ స్థాయి వారైనా, వారిని కఠినంగా శిక్షించాలని, నిర్భయ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చంద్రబాబు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News