8 year old girl raped and murdered: కథువా ఘటనపై కామెంట్ చేసిన ఉద్యోగిని తొలగించిన కోటక్ మహీంద్రా బ్యాంక్!

  • ఫేస్ బుక్ లో కథువా ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఉద్యోగి
  • ఉద్యోగితో పాటు సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు
  • ఉద్యోగిని విధుల్లోంచి తొలగించిన యాజమాన్యం

సోషల్ మీడియాలో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉద్యోగి చేసిన వ్యాఖ్యలు పెనుకలకలం రేపడంతో బ్యాంక్ స్పందించింది. అతనిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. దాని వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కొచ్చిలో పలారివట్టోమ్‌ బ్రాంచ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ విష్ణు నందకుమార్‌ తన ఫేస్‌ బుక్‌ అకౌంట్ లో కథువా హత్యాచార ఘటనపై మలయాళంలో స్పందిస్తూ, ‘ఈ వయసులో ఆమె చావడమే మంచిది. లేకపోతే పెరిగి పెద్దయ్యాక మానవ బాంబుగా మారి ఇండియాపైకి వచ్చేది’ అని పేర్కొన్నాడు.

దీంతో అతనిపై సోషల్‌ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమయింది. విష్ణును బండబూతులు తిడుతూ పలువురు పోస్టులు పెట్టారు. కొందరు నేరుగా కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కు హెచ్చరికలు చేశారు. అతనిని తక్షణమే విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన కోటక్ మహీంద్రా బ్యాంక్ ‘ఏప్రిల్‌ 11న విష్ణు నందకుమార్‌ ను ఉద్యోగం నుంచి తొలగించేశాం. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదు’ అని పేర్కొంటూ, విధుల్లో మెరుగైన నైపుణ్యం ప్రదర్శించని కారణంగానే అతనిని తొలగించినట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News