Chandrababu: చంద్రబాబు చేసిన మోసాల్లో అన్నింటి కన్నా దారుణమైన మోసం ఏంటో తెలుసా?: జగన్

  • ఒకే ఒక మార్గంలో ఏపీ యువతకి ఉద్యోగాలు వస్తాయి
  • ప్రత్యేక హోదాపై చంద్రబాబు అన్యాయం చేశారు
  • విభజన సమయంలో చంద్రబాబు సమన్యాయం కావాలన్నారు
  • ప్రత్యేక హోదా కావాలని ఊదరగొట్టారు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. ఈ రోజు అమరావతిలోని ఉండవల్లిలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ... ఏపీలో ఒకే ఒక మార్గంలో ఉద్యోగాలు వస్తాయని, అదే ప్రత్యేక హోదా అని అన్నారు. విభజన సమయంలో చంద్రబాబు సమన్యాయం కావాలని అన్నారని, ప్రత్యేక హోదా కావాలని ఊదరగొట్టారని, హోదా సంజీవని అన్నారని దెప్పిపొడిచారు.

"ఈ రోజు చంద్రబాబు చేసిన దారుణమైన మోసం ఏంటో తెలుసా? అన్నింటి కన్నా అన్యాయమైన మోసం ఏంటో తెలుసా?.. ప్రత్యేక హోదా.. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆ అంశాన్ని గట్టిగా ప్రధానమంత్రిని అడిగితే వచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు ఎండమావిగా తయారైంది.. దానికి చంద్రబాబు నాయుడే కారణం.. ప్రత్యేక హోదా మీద ఆయన చేసిన అన్యాయాన్ని చూడండి.

 కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌ సమావేశాల్లో అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదా ఇవ్వలేదని, వైసీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.. చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే తమ పార్టీ ఎంపీలతో కూడా రాజీనామా చేయించి, నిరాహార దీక్షకు కూర్చుంటే దేశం మొత్తం చర్చనీయాంశంగా మారేది కాదా? అని అడుగుతున్నాను. మోదీ ప్రభుత్వం దిగివచ్చి ప్రత్యేక హోదాను ఇచ్చేది కాదా?" అని జగన్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News