Andhra Pradesh: హోదా కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం : ఏపీ మహిళా కాంగ్రెస్ నేత సయ్యద్ హజీనా

- ఏపీ మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం
- టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలపై పోరాడేందుకు సన్నద్ధం కావాలి
- ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అన్ని హామీలు చేయాలి
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఏపీ మహిళా కాంగ్రెస్ ఉద్యమాన్ని తీవ్రతరం చేయనుందని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఇన్ చార్జ్ సయ్యద్ హజీనా పేర్కొన్నారు. ఏపీసీసీ రాష్ట్ర కార్యాలయం ఆంధ్రరత్నభవన్‌లో ఏపీ మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం ఈరోజు నిర్వహించారు. తొలుత మాజీ ప్రధాని ఇందిర గాంది విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏపీ మహిళా కాంగ్రెస్ ఇన్ చార్జి సయ్యద్ హజీనా మాట్లాడుతూ, టీడీపీ, బీజేపీ ప్రభుత్వాల ఎన్నికల హామీలు, వైఫల్యాలపై పోరాడేందుకు సన్నద్ధం కావాలని పిలుపు నిచ్చారు.