Jagan: కేంద్రం విచారణకు ఆదేశిస్తుందని చంద్రబాబుకి భయం.. అందుకే, ఢిల్లీకి వెళ్లారు: వైఎస్‌ జగన్

  • కేంద్ర సర్కారు విచారణకు ఆదేశిస్తుందని చంద్రబాబు భయం
  • ఇతర పార్టీల మద్దతు కూడగట్టడానికి ఢిల్లీకి వెళ్లారు
  • తన తరఫున మాట్లాడాలని ఇతర పార్టీల నాయకులతో చెబుతారు
  • మళ్లీ ప్రత్యేక హోదాపై మభ్య పెట్టాలని చూస్తున్నారు

గత నెల 15 వరకు అవిశ్వాస తీర్మానంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ ఒక్కరితోనూ మాట్లాడలేదని, ఆ తరువాత ఒక్కసారిగా తీరు మార్చుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తోన్న జగన్ ఈ రోజు మాయాబజార్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో మాట్లాడుతూ... "తమ ఎంపీలతో చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయించట్లేదో తెలుసా? విచ్చలవిడిగా తాను చేసిన అవినీతి మీద కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందని భయపడుతున్నారు.

ఒకవేళ తనపై విచారణకు ఆదేశిస్తే తన తరఫున పోరాడేందుకు ఎంపీలు ఉండాలని చంద్రబాబు వారితో రాజీనామా చేయించట్లేదు. మళ్లీ ఒకసారి ప్రత్యేక హోదాపై మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు ఇతర పార్టీల నాయకులతో ప్రత్యేక హోదా కోసం మాట్లాడడం లేదు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు మీద విచారణకు ఆదేశిస్తే ఇతర పార్టీల నాయకుల మద్దతు కూడా కూడగట్టడానికి వెళ్లారు.

తన తరఫున మాట్లాడాలని ఇతర పార్టీల నాయకులతో మాట్లాడడానికి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. ఇలాంటి మోసాలు చేసే వ్యక్తిని పొరపాటున కూడా క్షమించకూడదు" అని వ్యాఖ్యానించారు. పార్లమెంటు సమావేశాల చివరిరోజు తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని, టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తారా? అని జగన్ ప్రశ్నించారు. మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే కేంద్ర సర్కారు దిగొస్తుందని చెప్పుకొచ్చారు. 

  • Loading...

More Telugu News