: సరదా, సంగీతం, సంపద.. ఇవే అమ్మాయిల ప్రిఫరెన్స్‌


లండన్లోని దక్షిణ బ్రిటానీ యూనివర్సిటీ వారు నిర్వహించిన ఈ సర్వేను నిజానికి చాలా వివాదాస్పదమైనదిగానే పేర్కొనాలి. మనదేశంలో అయితే మహిళా వాదులు ఈ పాటికి పెద్ద ఉద్యమాన్నే లేవదీసి ఉండేవారేమో. ఈ యూనివర్సిటీ వారు.. పెద్దపెద్ద మాల్స్‌లో షాపింగ్‌కు వచ్చే కొన్ని వందల మంది యువతులపై ఓ అధ్యయనం నిర్వహించారు. అబ్బాయిల విషయంలో వారి మనోభిప్రాయాలను తెలుసుకున్నారు.

సరదాలు, సంగీతవాద్య పరికరాలు, సంపద చిహ్నాలు అమ్మాయిలను ఆకర్షిస్తాయని గుర్తించారు. ఉదాహరణకు గిటార్‌ పట్టుకున్న కుర్రాడు కనిపిస్తే అతని పట్ల అమ్మాయిలు ఆకర్షితులవుతారట. గిటార్‌ను ప్రతిభకు సంకేతంగా భావిస్తారట. ఆర్థికంగా కూడా ఉన్నవాడేలాగుంది.. హోదాకు తక్కువ ఉండదు లెమ్మని ఆలోచిస్తారట. అలాంటి కుర్రాళ్లతో మాటామాటా కలపడానికి, తమ ఫోను నెంబరు ఇవ్వడానికి ఎగబడతారట. చేరువ అయ్యే ప్రయత్నం చేస్తారట.

హమ్మో.. హమ్మో.. అమ్మాయిలు ఆల్మోస్ట్‌ సంపన్నుల వెంటపడతారన్నట్లుగా ఉంటున్న ఈ అధ్యయనం ఇంకా ఫెమినిస్టుల వరకు వెళ్లిందో లేదో.. సౌత్‌ బ్రిటానీ యూనివర్సిటీ ముందు ఎన్నెన్ని ధర్నాలు జరగబోతాయో వేచిచూడాలి.

  • Loading...

More Telugu News