: మదర్స్ డే కానుకగా ఫిన్‌ల్యాండ్ ట్రిప్ ఎంచుకోండి
మదర్స్ డే వచ్చేస్తోంది. తల్లులకు ఎలాంటి కానుక ఇవ్వాలా అని తల బద్దలు కొట్టుకుంటున్నారా...? మీ ఆప్షన్స్ జాబితాలో ఫిన్లాండ్‌ను కూడా జత చేసుకోండి. ఎందుకంటే.. తల్లులకు అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నదేశాలలో ఈ ప్రపంచంలో ఫిన్‌ల్యాండ్‌ను మించినది లేనేలేదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరోగ్యపరంగా, వైద్యపరంగా.. ఇతరత్రా ఏ రూపంలో చూసినా.. ఫిన్లాండ్ తల్లులకు అనుకూల దేశమట! ఆ విషయానికి వస్తే మనదేశం 142 వ స్థానంలో ఉందట.
ఇంతకూ ఏయే అంశాల ఆధారంగా ఈ అనుకూలతలను అధ్యయనకారులు గణించారో లెక్కతేలలేదు గానీ.. ఫిన్‌లాండ్ తర్వాతి స్థానాల్లో మాత్రం... స్వీడన్, ఐస్‌ల్యాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, స్పెయిన్, బెల్జియం, జర్మనీ, ఆస్ట్రేలియా లాంటి దేశాలున్నాయి. కాంగో అనే చోటు మాత్రం.. తల్లులకు ఏమాత్రం అనుకూలమైనది కాదుట.. ఎందుకంటే.. ప్రతి 30 మంది గర్భిణుల్లో ఒకరు ప్రసవంలో మరణిస్తున్నారట. నిరక్షరాస్యత సహజంగానే ఈ దేశంలో చాలా ఎక్కువగా ఉన్నదట.