smith: ఎయిర్ పోర్టులో స్టీవ్ స్మిత్ ను ఘోరంగా అవమానించిన సౌతాఫ్రికా పోలీసులు, ప్రయాణికులు... వీడియో!

  • కేప్ టౌన్ లో ఉన్న స్టీవ్ స్మిత్
  • నిషేధం తరువాత స్వదేశానికి పయనం
  • ఎయిర్ పోర్టులో ఘోర అవమానం

బాల్ ట్యాంపరింగ్ తో ఆస్ట్రేలియా క్రికెట్ పరువు తీసిన స్టీవ్ స్మిత్ పై నిషేధం పడగా, ప్రస్తుతం కేప్ టౌన్ లో ఉన్న ఆయన, తిరిగి స్వదేశానికి బయలుదేరిన వేళ, ఎయిర్ పోర్టులో ఘోర అవమానాన్ని ఎదుర్కొన్నాడు. ఎయిర్ పోర్టులో ఉన్న ప్రయాణికులు, క్రికెట్ అభిమానులు స్మిత్ ను చూడగానే 'చీట్', 'చీటర్', 'చీటింగ్' అంటూ హేళనగా మాట్లాడారు.

ఇదే సమయంలో స్మిత్ కు రక్షణగా వచ్చిన పోలీసులు సైతం ఆయనపై ఏ విధమైన గౌరవం లేకుండా ప్రవర్తించారు. ఏదో మొక్కుబడిగా పక్కన ఉండి, దాదాపు నేరస్తుడిని లాక్కుని వెళ్లినట్టుగా లాక్కెళ్లారు. ఎస్కులేటర్ ఎక్కనీయకుండా నడిపించుకుంటూ తీసుకెళ్లారు.

ఈ వీడియోను ఎవరో తీసి సోషల్ మీడియాలో పెట్టగా స్మిత్ పై పలువురు సానుభూతిని చూపుతున్నారు. ఎంత బాల్ ట్యాంపరింగ్ తప్పు చేసినా, అతనికి పడాల్సిన శిక్ష పడిందని, ఓ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టార్ తో సౌతాఫ్రికా వ్యవహరించిన తీరు సరికాదని కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News