: తలసీమియా రోగులను వికలాంగులుగా గుర్తించండి
మన రాష్ట్రంలో ఇప్పుడు వికలాంగులకు కల్పించాల్సిన ప్రత్యేక సదుపాయాల గురించి ఓ ప్రత్యేక పోరాటం ప్రారంభమైంది. ఇదేసమయంలో ఉత్తరాదిలో సిమ్లా కేంద్రంగా పనిచేసే ఉమాంగ్ ఫౌండేషన్ అనే సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని తలసీమియా రోగులను వికలాంగులుగా గుర్తించాల్సిందిగా కోరింది. అందువల్ల ఆ రోగగ్రస్తులకు కూడా వికలాంగులకు వర్తించే అన్ని సదుపాయాలు పొందడానికి అర్హత వస్తుందని కోరింది.
తలసీమియా డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్ అజయ్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.. ప్రభుత్వం తలసీమియా సోకిన పిల్లలను గుర్తించి.. వారికి అనుకూల పాలసీ తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలని కోరారు. తలసీమియా సోకిన పిల్లలు పనులు చేసుకునే విషయంలో వికలాంగుల్లాగానే బాధపడతారని, అందువల్ల వారిని వికలాంగులుగా గుర్తిస్తే.. పాఠశాలనుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఉపకారవేతనాలు పొందడానికి వీలుంటుందని వారు డిమాండ్ చేస్తున్నారు.