: ఏమో కారులు ఎగరావచ్చు


ఏమో! రోడ్డు మీద వెళుతూ వెళుతూ ఉన్న కారు.. హఠాత్తుగా నిట్టనిలువుగా గాల్లోకి ఎగరవవచ్చు. కనులు మూసి తెరిచేంతలోగా.. కొన్ని కిలోమీటర్ల దూరం గాల్లో దూసుకెళ్లిపోవచ్చు. ఇదేమీ విఠలాచార్య లేదా రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో సన్నివేశం కాదు. మరో పదేళ్లలో మన కళ్లముందే సాక్షాత్కరించవచ్చు. ఎగిరేకారు తయారీకి జరుగుతున్న ప్రయత్నాలు మరో పదేళ్లలో కార్యరూపం దాల్చవచ్చునని.. అమెరికాకు చెందిన టెర్రాపుజియా ఇంజినీరింగ్‌ సంస్థ ప్రకటిస్తోంది.

ప్రస్తుతం ఆ సంస్థ తాము రూపకల్పన చేస్తున్న ఎగిరేకారు చిత్రాలను విడుదల చేసింది. టీఎఫ్‌`ఎక్స్‌ పేరుతో రూపొందిస్తున్న ఈ కారులో నలుగురు ప్రయాణించవచ్చు. గాలిలోకి ఎగిరిన దగ్గరినుంచి, తిరిగి దిగేవరకు ఇది అన్ని జాగ్రత్తలు స్వయంచాలితంగా పాటిస్తుంది. ఇది గరిష్టంగా 320 కిమీలు వెళ్లగలుగుతుందిట.

  • Loading...

More Telugu News