Chandrababu: టీడీపీ ఎంపీలందరూ ఈ రాత్రికే ఢిల్లీ చేరుకోవాలి: చంద్రబాబు ఆదేశాలు

  • టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు
  • పసుపు చొక్కాలు, కండువాలు ధరించి సభకు హాజరు కావాలి
  • అన్ని పార్టీల నేతలను కలిసి ఏపీకి సహకరించమని కోరాలి
  • టీడీపీపై బీజేపీ చేస్తున్న దుష్ప్రచారం ఎక్కువైంది 

టీడీపీ ఎంపీలందరూ ఈ రాత్రికే ఢిల్లీ చేరుకోవాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. తమ పార్టీ ఎంపీలతో ఈరోజు సాయంత్రం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ ఎంపీలందరూ పసుపు చొక్కాలు, కండువాలతో సభకు హాజరు కావాలని సూచించారు. అవిశ్వాస తీర్మానం రేపు చర్చకు వచ్చే అవకాశం ఉందని, అన్ని పార్టీల నేతలను కలిసి ఏపీకి సహకరించాలని కోరాలని, ఏపీకి జరిగిన అన్యాయం గురించి ఆయా పార్టీల నేతలకు వివరించాలని చెప్పారు. మన వద్ద ఉన్న సమాచారం అంతా ఆయా పార్టీల వారికి ఇవ్వాలని, టీఆర్ఎస్ కూడా మనకు సహకరించేందుకు ముందుకొచ్చిందని  అన్నారు. ఏపీని ఒంటరిని చేయాలనే బీజేపీ ప్రయత్నాలను తిప్పికొట్టాలని, ఎంపీలకు సమాచారం అందించేందుకు రెండు బృందాలు ఏర్పాటు చేశామని, ఢిల్లీలో ఒక బృందం, అమరావతి నుంచి మరో బృందం  పని చేస్తోందని చెప్పారు. సామాజిక మాధ్యమాలు వేదికగా టీడీపీపై బీజేపీ చేస్తున్న దుష్ప్రచారం ఎక్కువైందని, దీనిపై ఎవరూ అధైర్యపడొద్దని, వెనుకంజ వేయొద్దని, సీఎం చంద్రబాబునాయుడు తమ పార్టీ నేతలకు సూచించారు

  • Loading...

More Telugu News