Chandrababu: చంద్రబాబు కీలక నిర్ణయం .. రేపు అఖిలపక్ష సమావేశం

  • రేపు ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో సమావేశం
  • రాజకీయ పార్టీలతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులకు ఆహ్వానం
  • ఒక్కో రాజకీయ పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులకు అవకాశం

సీఎం చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నేతృత్వంలో రేపు ఉదయం పదకొండు గంటలకు వెలగపూడి సచివాలయంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులను ఆహ్వానించినట్టు సమాచారం. ఒక్కో రాజకీయ పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధుల చొప్పున ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కాగా, కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో చర్చ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది

  • Loading...

More Telugu News