: కర్ణాటక ఫలితాలపై 'చిరు' హర్షం
కన్నడనాట ఎన్నికల్లో కాంగ్రెస్ జయభేరి మోగించడం పట్ల కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. అవినీతిపై ప్రజలు సాధించిన విజయంగా దీన్ని పేర్కొన్నారు. మనరాష్ట్రంలోనూ ప్రజలు ఇలాంటి నిర్ణయమే తీసుకుంటారని చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీపై వస్తోన్న అవినీతి ఆరోపణలు నిలబడేవి కావని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో నేడు ఆయన మీడియాతో మాట్లాడారు.