balakrishna: 'జై సింహా' దర్శకుడితో కొత్త ప్రాజెక్ట్ .. మాఫియా డాన్ గా బాలకృష్ణ

  • కన్నడలో హిట్ కొట్టిన 'మఫ్టీ'
  • తెలుగు రీమేక్ లో బాలకృష్ణ 
  • దర్శకుడిగా కె.ఎస్.రవికుమార్

బాలకృష్ణ 'మఫ్టీ' అనే ఓ కన్నడ సినిమా తెలుగు రీమేక్ లో చేసే అవకాశం ఉందనే వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. కన్నడలో శివరాజ్ కుమార్ చేసిన ఈ సినిమా అక్కడ 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. అలాంటి ఈ సినిమాను బాలకృష్ణతో రీమేక్ చేయాలని దర్శకుడు కె. ఎస్. రవికుమార్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తాజా సమాచారం.

 ఇంతకుముందు బాలకృష్ణతో 'జై సింహా' చేసిన ఆయన .. రీసెంట్ గా బాలకృష్ణను కలిసి 'మఫ్టీ' కథ చెప్పారట. ఇంకా ఈ కథపై చర్చలు జరుగుతూనే ఉన్నాయని అంటున్నారు. బాలకృష్ణ పుట్టినరోజైన జూన్ 10వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సినిమాలో కథానాయకుడు మాఫియా డాన్ గా కనిపిస్తాడట. ఈ పాత్ర స్వభావం కొత్తగా ఉండటంతో బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని చెబుతున్నారు.  

More Telugu News