: శ్రీవారి భక్తులకు డ్రెస్ కోడ్
తిరుమల వెంకన్న దర్శనార్థం వచ్చే వీఐపీ భక్తులు ఇక నుంచి తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులే ధరించాల్సి ఉంటుంది. ఈమేరకు టీటీడీ నూతన డ్రెస్ కోడ్ ప్రకటించింది. వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకునే భక్తులు.. పురుషులైతే పంచె-ధోవతి, కుర్తా-పైజమా, స్త్రీలైతే చీర-రవిక, లంగా-ఓణి, చున్నీతో పంజాబీ డ్రస్ ధరించాల్సి ఉంటుంది. ఈ నెల 15 నుంచి తాజా నిబంధన అమల్లోకి వస్తుందని టీటీడీ తెలిపింది. కొద్దికాలం తర్వాత సాధారణ భక్తులందరికీ ఈ నిబంధన వర్తింపజేస్తామని టీటీడీ పేర్కొంది.