: కాంగ్రెస్ గూటికి గజల్ శ్రీనివాస్
ప్రఖ్యాత గాయకుడు గజల్ శ్రీనివాస్ నేడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో గులాంనబీ ఆజాద్ ను కలిసిన శ్రీనివాస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. కాగా, ఇంతకుముందు గజల్ శ్రీనివాస్ ఈ నెల 12న పార్టీలో చేరతారని కథనాలొచ్చినా, ఆయన కాస్తంత ముందే పార్టీ కండువా ధరించారు.