Chandrababu: నా జీవితంలో నేను కష్టపడ్డట్టుగా ఏ రాజకీయ నాయకుడూ కష్టపడలేదు : సీఎం చంద్రబాబు

  • నా జీవితంలో ఎన్నో సవాళ్లు, సంక్షోభాలు ఎదుర్కొన్నా
  • ప్రతి సవాల్ ని ఓ ఛాలెంజ్ గా తీసుకున్నా
  • భయమంటే ఏంటో నాకు తెలియదు
  • వెనుకడుగు వేయడం నాకు తెలియదు : చంద్రబాబు

‘నా జీవితంలో నేను కష్టపడ్డట్టుగా ఏ రాజకీయ నాయకుడు కష్టపడలేదు’ అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. రాజకీయాల్లోకి చంద్రబాబు అడుగుపెట్టి నలభై సంవత్సరాలు పూర్తయింది.

 ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, ‘అదే సమయంలో నా జీవితంలో నేను ఎదుర్కొన్న సవాళ్లు, ఎదురైన సంక్షోభాలు ఏ రాజకీయనాయకుడికి వచ్చి ఉండవు! ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకున్నా. ప్రతి సవాల్ ని ఓ ఛాలెంజ్ గా తీసుకున్నా. నా జీవితంలో భయమంటే ఏంటో నాకు తెలియదు. ముందుకు పోవడం తప్ప, వెనుకడుగు వేయడం నా జీవితంలో లేదు. ఉదయం నిద్ర లేచిన తర్వాత ఎక్సర్ సైజ్, మెడిటేషన్ చేస్తాను.  ‘నేనెవరిని’ అనే విషయాన్ని గుర్తుచేసుకుంటాను.  నేను ఎక్కడ పుట్టాను. ఏవిధంగా చదువుకున్నాను. చిన్నప్పుడు ఏవిధంగా   కష్టపడ్డాను. ఎక్కడెక్కడ చదువుకున్నాను. ఏవిధంగా పైకొచ్చాను... ఇంతవరకూ జరిగిన విషయాలను, ఇప్పుడు నా బాధ్యత ఏంటి? అనే విషయాన్ని ఉదయం పది నిమిషాల పాటు గుర్తుచేసుకుంటాను. ఒక పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా నా బాధ్యత ఏంటి అనే విషయాలను ఆలోచిస్తాను. అదే సమయంలో, నా కుటుంబ వ్యవహారాలనూ ఆలోచిస్తాను. కుటుంబ వ్యవస్థ అనేది భారతదేశానికి ఒక సంపద అనే విషయాన్ని నేను ప్రగాఢంగా నమ్ముతాను’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News