Andhra Pradesh: చంద్రబాబుకి శోభన్‌బాబులా హెయిర్‌స్టైల్‌ ఉండేది.. నవ్వులు పూయించిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు

  • శాసనసభలో చంద్రబాబు అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తి
  • అసెంబ్లీలో అభినందనల తీర్మానం
  • అప్పట్లో చంద్రబాబు చాలా స్మార్ట్‌గా ఉండేవారు-విష్ణుకుమార్‌ రాజు
  • చాలా మంది మహిళల మనసులను దోచుకున్నారు

తాను 1978లో ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి చేసుకుని ఇంజనీరింగ్‌లో చేరాలనుకున్నానని, సెలవులు రావడంతో సినిమాకు వెళ్లాలనుకున్నానని, అయితే, అప్పట్లో సినిమా టిక్కెట్లు దొరకాలంటే కొందరు.. రాజకీయనాయకుల రికమండేషన్ తెచ్చుకునేవారని బీజేపీ ఎమ్మెల్యే  విష్ణుకుమార్ అన్నారు. మంత్రుల దగ్గరకు వెళ్లి ఓ లెటర్ తీసుకురావాలని చెప్పేవారని వ్యాఖ్యానించారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు సినీమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారని అన్నారు. తాను అప్పటి నుంచి చంద్రబాబు నాయుడిని బాగా గమనిస్తున్నానని అన్నారు.

శాసనసభలో చంద్రబాబు నాయుడు అడుగుపెట్టి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చంద్రబాబును అభినందిస్తూ ఈ రోజు ఏపీ శాసనసభలో అభినందన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ... అప్పట్లో చంద్రబాబు నాయుడు బెల్ బాటన్ ప్యాంట్లు వేసేవారని అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు.. శోభన్ బాబులా హెయిర్ స్టైల్ మెయింటెన్ చేసేవారని చెప్పి నవ్వులు పూయించారు. అప్పట్లో చంద్రబాబు చాలా స్మార్ట్‌గా ఉండేవారని, తన ఉద్దేశం ఇప్పుడు లేరని కాదని, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని ఆయన అన్నారు. చంద్రబాబు అప్పట్లో చాలా మంది మహిళల మనసులను దోచేశారని వ్యాఖ్యానించారు. దీంతో చంద్రబాబు నాయుడితో పాటు సభ్యులందరూ చిరునవ్వులు చిందించారు. 

  • Loading...

More Telugu News