: మంత్రి శైలజానాథ్ పై లోకాయుక్తలో ఫిర్యాదు
కోబ్రాపోస్ట్ ఆన్ లైన్ మ్యాగజైన్ స్టింగ్ ఆపరేషన్లో అడ్డంగా బుక్కయిపోయిన మంత్రి శైలజానాథ్ పై నేడు లోకాయుక్తలో ఫిర్యాదు దాఖలైంది. మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో మంత్రి పాత్రపై లోతైన దర్యాప్తు నిర్వహించాలని కోరుతూ అరుణ్ కుమార్ అనే హైకోర్టు న్యాయవాది లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. హవాలా ఉదంతంలో ఓ ఆసుపత్రి అధినేతకు మంత్రి హోదాలో ష్యూరిటీ ఇచ్చేందుకు సిద్ధపడడం సరికాదని అరుణ్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.