: హైదరాబాద్ సమీపంలో విద్యార్థిని అపహరణ


ప్రేమోన్మాదులు బరితెగిస్తూనే ఉన్నారు. పట్టపగలు తండ్రితో కలిసి వెళుతున్న విద్యార్థినిని అపహరించుకుపోయారు కిరాతకులు. ఈ సంచలన ఘటన హైదరాబాద్ కు సమీపంలో ఈ రోజు ఉదయం జరిగింది. మెదక్ జిల్లా పటానుచెరు మండలం నందిగామకు చెందిన శ్రీలత ఎంబీయే చదువుతోంది. రామిరెడ్డి కళాశాలలో రికార్డులను సమర్పించేందుకు తండ్రితో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతోంది. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ఆమెను అపహరించుకుపోయారు. దీనిపై శ్రీలత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వడ్డేపల్లికి చెందిన శ్రీనివాస్ తన కూతురును ప్రేమించాలంటూ వెంటపడేవాడని.. ఈ కిడ్నాప్ అతడి పనే అయ్యుంటుందని ఆయన తెలిపారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News