Galla Jayadev: పార్లమెంట్ ముందు ప్లకార్డుతో నిలుచున్న ప్రిన్స్ మహేష్ బాబు మేనల్లుడు!

  • పార్లమెంట్ కు వచ్చిన ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు సిద్దార్థ్
  • ప్లకార్డులు పట్టుకుని రాష్ట్రానికి న్యాయం చేయాలని నినాదాలు
  • ఎవరీ కుర్రాడని ఆరా తీసిన ఇతర రాష్ట్రాల ఎంపీలు

నేడు పార్లమెంట్ ఆవరణలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు చేస్తున్న నిరసనల్లో ప్రిన్స్ మహేష్ బాబు మేనల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు సిద్దార్థ్ నేడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఉదయం పార్లమెంట్ కు వచ్చిన సిద్దార్థ్, ప్లకార్డు పట్టుకుని పార్లమెంట్ ముందు నిలబడి నినాదాలు చేస్తుంటే, అటుగా వెళ్లేవారిలో పలువురు ఎవరీ కుర్రాడని ఆరా తీయడం కనిపించింది.

 'విభజన హామీలు అమలు చేయాలి' అని రాసున్న ప్లకార్డును ప్రదర్శించిన సిద్దార్థ్, రాష్ట్రానికి న్యాయం చేయాలని నినదించాడు. కాగా, నేడు కూడా లోక్ సభ, రాజ్యసభల్లో టీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. గాంధీ విగ్రహం ముందు ప్లకార్డులు పట్టుకుని ప్రత్యేక హోదా కావాలని నినాదాలు చేశారు. 

  • Loading...

More Telugu News