Andhra Pradesh: ఏపీ టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఖరారు
- రాజ్యసభ అభ్యర్థులుగా సీఎం రమేశ్, కనకమేడల రవీంద్ర కుమార్
- టీడీపీ అధిష్ఠానం నిర్ణయం
- చివరి నిమిషం వరకూ రేస్ లో ఉన్న వర్ల రామయ్యకు దక్కని అవకాశం
ఏపీ టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఖరారైంది. సీఎం రమేశ్, కనకమేడల రవీంద్ర కుమార్ పేర్లను ఖరారు చేస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. కాగా, రాజ్యసభకు ఎంపికైన వారిలో సీఎం రమేశ్ తో పాటు వర్ల రామయ్య పేరు కూడా మొదట్లో వినపడింది. అయితే, చివరి నిమిషం వరకూ రేస్ లో ఉన్న వర్ల రామయ్యకు అవకాశం దక్కకపోగా, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుగు కనకమేడల రవీంద్రకుమార్ అవకాశం లభించడం గమనార్హం. రాజ్యసభలో రెండు స్థానాలనూ ఓసీలకే కేటాయించినట్టు అయిందని, సీఎం చంద్రబాబు సహజశైలికి భిన్నంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని టీడీపీ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం.