Andhra Pradesh: ఏపీకి ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేరుస్తున్నాం: ఎంపీ హరిబాబు

  • ఏపీకి కేంద్రం ఏమీ చేయలేదనడం చాలా బాధకరం
  • మూడున్నరేళ్లలో 9 ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను ప్రారంభించాం
  • విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు పై  కసరత్తు ప్రారంభమైంది
  • మీడియాతో బీజేపీ ఎంపీ హరిబాబు

ఏపీకి ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేరుస్తున్నామని బీజేపీ ఎంపీ హరిబాబు అన్నారు. విజయవాడలో ఈరోజు జరిగిన ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం, మీడియాతో హరిబాబు మాట్లాడుతూ, ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదనడం చాలా బాధకరమని, మూడున్నరేళ్లలో 9 ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను ప్రారంభించామని అన్నారు. ఓడరేవు నిర్మాణం, స్టీల్ ప్లాంట్, రైల్వేజోన్,పెట్రోలియం కాంప్లెక్స్ ఏర్పాటు పైనా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు. విశాఖపట్టణం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు పైనా కసరత్తు ప్రారంభమైందని, విభజన చట్టంలో చెప్పని అనేక సంస్థలను ఏపీకి మంజూరు చేశామని అన్నారు. ఈ మూడున్నరేళ్లలో ఆంధ్రా ప్రాంతంలో నరేంద్రమోదీ నాయకత్వంలో జరిగినంత అభివృద్ధి గతంలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏ కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రానికి ఇవ్వనంత సాయాన్ని విడిపోయిన ఏపీకి తమ ప్రభుత్వం చేసిందని అన్నారు.

  • Loading...

More Telugu News