Azam Khan: ఆజాంఖాన్‌పై జయప్రద సంచలన వ్యాఖ్యలు

  • 2009 యూపీ ఎన్నికల సందర్భంగా ఆజాం తనను వేదనకు గురిచేశారని ఆరోపణ
  • 'పద్మావత్'లోని ఖిల్జీ పాత్రతో ఆజాం ఖాన్‌కు పోలిక
  • పలు సందర్భాల్లో ఎస్‌పీ నేతపై జయప్రద విసుర్లు

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) సీనియర్ నేత ఆజాం ఖాన్‌పై ఆ పార్టీ బహిష్కృత నేత, నటి జయప్రద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2009లో యూపీలోని రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల సందర్భంగా ఆయన తనను తీవ్ర మనోవేదనకు గురిచేశారని ఆమె ఆరోపించారు. ఇటీవల విడుదలయిన బాలీవుడ్ చిత్రం 'పద్మావత్‌'లోని ప్రతినాయక పాత్ర ఖిల్జీతో ఆయన్ను పోల్చారు. కాగా, మే, 2009లో జరిగిన ఎన్నికల సందర్భంగా తన ప్రతిష్టను దిగజార్చడానికి ఆజాం ఖాన్ చౌకబారు కుయుక్తులు ఉపయోగించారని జయప్రద మండిపడిన సంగతి తెలిసిందే. 'పద్మావత్‌' చిత్రాన్ని చూస్తున్నంత సేపు అందులోని ఖిల్జీ పాత్ర ఆజాం ఖాన్ జీను ప్రతిఫలించిందని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పోటీ చేసేటపుడు ఆయన తనను వేధించారని ఆమె ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు. ఆజాం ఖాన్ తన ఫొటోలను ఆభ్యంతరకరమైన రీతిలో మార్ఫింగ్ చేసి సీడీల రూపంలో పంపిణి చేశారని జయప్రద గతంలోనూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలా పలు సందర్భాల్లో ఆజాం ఖాన్‌పై ఆమె విరుచుకుపడుతూనే ఉన్నారు.

  • Loading...

More Telugu News