shami: బీసీసీఐ సాయం తీసుకోవాలని క్రికెటర్ షమి భార్య హసిన్‌ జహాన్‌ నిర్ణయం

  • మా న్యాయవాది బీసీసీఐతో సంప్రదింపులు జరుపుతున్నారు-హసిన్ 
  • ఇటువంటి వ్యవహారాలు ఇక్కడితో ఆగిపోవాలి
  • లేదంటే భవిష్యత్తులో మరికొందరు ఆటగాళ్లు కూడా ఇలాగే చేస్తారు

తన భర్తతో పాటు ఆయన కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేశారని, తన భర్తకు ఇతర మహిళతో వివాహేతర సంబంధం ఉందని టీమిండియా బౌలర్ మహమ్మద్ షమిపై ఆయన భార్య హసీన్ జహాన్ తీవ్ర ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఆమె చేసిన ఫిర్యాదుతో ఇప్పటికే పోలీసులు.. షమితో పాటు నలుగురిపై ఐపీసీ 498 ఏ, 323తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

కాగా, ఈ విషయంలో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) సాయం తీసుకోవాలని షమి భార్య హసిన్‌ జహాన్‌ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం తన న్యాయవాది ఈ విషయమై బీసీసీఐ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని చెప్పింది. ఇటువంటి వ్యవహారాలు ఇక్కడితో ఆగిపోవాలని, లేదంటే భవిష్యత్తులో మరికొందరు ఆటగాళ్లు కూడా ఇలాగే చేసే  అవకాశం ఉంటుందని తెలిపింది.

More Telugu News