Chandrababu: ముగిసిన చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌.. ఎన్డీఏనుంచి బయటకు వచ్చేద్దామని చెప్పిన ఎంపీలు

  • ప్రస్తుతం తమ మంత్రులతో చంద్రబాబు చర్చ
  • మీడియా ముందుకు వచ్చి కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం
  • ప్రత్యేక హోదా ఇవ్వలేమని అరుణ్ జైట్లీ మరోసారి స్పష్టం చేయడంపై తీవ్ర అసంతృప్తి

అమరావతిలోని సచివాలయం నుంచి టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌ కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేద్దామని టెలీకాన్ఫరెన్స్ లో పాల్గొన్న టీడీపీ ఎంపీలందరూ చెప్పారు. ప్రస్తుతం ఎంపీలతో టెలికాన్ఫరెన్స్‌ ముగిసింది. చంద్రబాబు తమ మంత్రులతో చర్చిస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి కీలక నిర్ణయంపై ప్రకటన చేసే అంశంపై మంత్రుల సూచనలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి స్పష్టం చేసిన నేపథ్యంలో చంద్రబాబు ఈ సమావేశం నిర్వహించారు.

  • Loading...

More Telugu News