Chandrababu: అవిశ్వాస తీర్మానం వల్ల ఏం లాభం లేదు!: చంద్రబాబు
- కొందరు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని అంటున్నారు
- ఒక్క రోజు చర్చతో అంతా ముగిసిపోతుంది
- ఏం లాభం ఉండదు
- విభజన చట్టంలోని 19 అంశాలు అమలు కావాలి
ఏపీ సమస్యలు పరిష్కారం కావాలన్నదే తమ డిమాండ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ నేతలతో అన్నారు. టీడీఎల్పీ సమావేశంలో తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడిన చంద్రబాబు... కొందరు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని అంటున్నారని, తీర్మానం పెట్టడానికి 50 మంది సంతకాలు కావాలని అన్నారు.
ఆ తర్వాత ఒకరోజు చర్చతో అంతా ముగిసిపోతుందని, దాని వల్ల ఏం లాభం ఉండబోదని తెలిపారు. విభజన చట్టంలోని 19 అంశాలు, అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన 6 హామీలు అమలు కావాలని అన్నారు. ఏపీకి మరింత ప్రయోజనం కలుగుతుందనే తాము కేంద్ర ప్రభుత్వంలో చేరామని చెప్పారు. ఇప్పుడున్న రెండు కేంద్ర మంత్రుల పదవుల్లో ఏముందని ప్రశ్నించారు. అవేమన్నా ప్రాధాన్యం ఉన్న పదవులా? అని అన్నారు.