Chandrababu: ఈ ప్రతిపక్షం మన దురదృష్టం కొద్దీ ఉంది: సీఎం చంద్రబాబు

  • ప్రజాసమస్యలపై చర్చించాలని మనకు అవకాశం ఇచ్చారు
  • బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ అయితే ప్రజల కోసం పనిచేయాలి
  • విపక్షంలో ఉన్నప్పుడు మేము అనునిత్యం సమస్యలపై పోరాడాం
  • ప్రతిపక్షం ఉపాధి హామీ నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అడ్డుకోవడానికి ప్రయత్నించింది

ప్రజాసమస్యలపై చర్చించాలని ప్రజలు అవకాశం ఇచ్చారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని హేతుబద్ధంగా విభజించి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కావని అన్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ అయితే ప్రజల కోసం పనిచేయాలని, విపక్షంలో ఉన్నప్పుడు తాము అనునిత్యం సమస్యలపై పోరాడామని అన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రతిపక్షం ఉపాధి హామీ నిధులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అడ్డుకోవడానికి ప్రయత్నించిందని చెప్పారు. ఈ ప్రతిపక్షం మన దురదృష్టం కొద్దీ ఉందని వ్యాఖ్యానించారు. సభ్యులందరూ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని కోరారు. ఎన్నికల ముందు ఏపీలో ప్రవేశపెట్టే బడ్జెట్‌ ఇదే చివరిదని అన్నారు. కాగా, ఎల్లుండి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.    

  • Loading...

More Telugu News