: జై'చిరంజీవ' అంటే ఓట్లు రాలతాయా..!?
వచ్చే ఎన్నికల్లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ప్రజల్లోకి వెళితే అంతే సంగతులు అని రాష్ట్ర మంత్రుల్లో అత్యధికులు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. కిరణ్ వ్యవహారశైలిపై ఇప్పటికే పలువురు బహిరంగంగా ఆక్రోశం వెళ్ళగక్కుతున్న సంగతి తెలిసిందే. మంత్రి సి. రామచంద్రయ్య ఓ అడుగు ముందుకేసి 2014 ఎన్నికల్లో చిరంజీవే ముఖ్యమంత్రి అభ్యర్థి అని అనధికార ప్రచారం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
తాజాగా చిరంజీవి సీఎం కావాలనుకోవడంలో తప్పులేదని మరో మంత్రి రఘువీరారెడ్డి వ్యాఖ్యానించడం సీఎం కిరణ్ వ్యతిరేక వర్గం నానాటికీ పెరిగిపోతోందన్న విషయాన్ని నిరూపిస్తోంది. పైగా, కేంద్రమంత్రి చిరంజీవే స్వయంగా తన నివాసంలో పలువురు మంత్రులకు విందు ఇవ్వడం ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది.