YSRCP: మార్చి 21న కేంద్రంపై అవిశ్వాసం పెడతాం : వైఎస్ జగన్
- ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో పోరాడతారు
- అప్పటికీ కేంద్రం స్పందించకపోతే మార్చి 21న అవిశ్వాసం పెడతాం
- ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తారు : జగన్
ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో పోరాడతారని, అప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే మార్చి 21న అవిశ్వాసం పెడతామని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో జగన్ మాట్లాడుతూ, ఏప్రిల్ 6న వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని వెల్లడించారు.
ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా చంద్రబాబుతో పాటు కరవు కూడా ఆయన అడుగులో అడుగు వేసిందని విమర్శించారు. చంద్రబాబు పాలనలో రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని, కనీసం పంటలకు కూడా గిట్టుబాటు ధర కల్పించడం లేదని విమర్శించారు.