KCR: చాటలో తౌడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్టుగా ఉంది: సీఎం కేసీఆర్
- నీటి వాటాల పంపిణీలో అలవికాని జాప్యం జరుగుతోంది
- జలవివాదం పరిష్కారానికి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ పద్నాలుగేళ్లు తీసుకుంది
- ప్రజలతో జాతీయ పార్టీలు ఆడుకుంటున్నాయి : కేసీఆర్
నీటి వాటాల పంపిణీలో అలవికాని జాప్యం జరుగుతోందని, ‘చాటలో తౌడు పోసి కుక్కలకు కొట్లాట పెట్టినట్టుగా ఉంది’ అని సీఎం కేసీఆర్ విమర్శించారు. హైదరాబాద్ లోని ప్రగతిభవన్లో ఈరోజు ఆయన మాట్లాడుతూ, రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం పరిష్కారానికి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ పద్నాలుగేళ్లు తీసుకుందని విమర్శించారు.
అన్ని వస్తువుల ధరలు మాత్రం పెరుగుతాయి కానీ, రైతులు పండించే ధాన్యానికి ధరలు మాత్రం పెరగవని కేంద్రంపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రజలతో జాతీయ పార్టీలు ఆడుకుంటున్నాయని, నరేగా కూలీలకు ఢిల్లీలో చెల్లింపులు జరపడం, ప్రజాస్వామ్యమా? ఇందుకు సరైన ఉదాహరణ ‘ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన’ అని అన్నారు. ఆరు లక్షల గ్రామాల్లో రోడ్ల నిర్మాణంపై ప్రధానికి ఏం సంబంధం? ఢిల్లీలో పెత్తనం పెట్టుకుని తమాషాలు చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు.