Telangana: కార్యకర్తలను క్షమాపణలు కోరిన మోత్కుపల్లి
- ఈ వ్యాఖ్యలపై కార్యకర్తలను తాను క్షమాపణలు కోరుతున్నా
- పార్టీపై చంద్రబాబు కాస్త దృష్టి పెడితే పూర్వ వైభవం సాధించవచ్చు
- కీలక సమయాల్లో చంద్రబాబుకు నేను అండగా ఉన్నా : మోత్కుపల్లి
టీఆర్ఎస్ తో టీటీడీపీ పొత్తు పెట్టుకోవాల్సిందేనని వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు క్షమాపణలు చెప్పారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ విలీన వ్యాఖ్యలపై కార్యకర్తలను తాను క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. తెలంగాణలో చంద్రబాబు పర్యటిస్తే బాగుంటుందని, పార్టీకి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. పార్టీపై చంద్రబాబు కాస్త దృష్టి పెడితే పూర్వ వైభవం సాధించవచ్చని అన్నారు. కీలక సమయాల్లో చంద్రబాబుకు తాను అండగా ఉన్నానని, తనను చంపాలని కొందరు రెక్కీ నిర్వహించినప్పటికీ బాబును తాను వీడలేదని చెప్పారు.