Kaala: 'ఏంట్రా సెట్టింగా?... దిల్లుంటే అందరూ రండి' అంటూ దుమ్మురేపుతూ వచ్చిన 'కాలా'!

  • రజనీ అభిమానులు ఎదురుచూస్తున్న 'కాలా'
  • టీజర్ ను విడుదల చేసిన చిత్ర టీమ్
  • అప్పుడే 12.68 లక్షల వ్యూస్

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. ధనుష్ నిర్మాతగా, లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన 'కాలా' చిత్రం అఫీషియల్ టీజర్ ఈ ఉదయం సోషల్ మీడియాలో విడుదలైంది. ఇందులో రజనీ లుక్స్, స్టయిల్ అదిరిపోయేలా ఉన్నాయని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ టీజర్ తమిళ్ లో విడుదల అయింది.

"కాలా... ఏం పేరురా?" అన్న నానా పటేకర్ డైలాగుతో పాటు "కాలా అంటే నిప్పు" అంటున్న రజనీ డైలాగ్, మరికొన్ని మాటలు వినిపిస్తున్నాయి. కొన్ని ఫైట్ సీన్స్, విద్యాబాలన్ తదితరులనూ పరిచయం చేస్తోందీ టీజర్. ఆపై "ఏంట్రా సెట్టింగా?...దిల్లుంటే అందరూ రండి" అన్న రజనీ మరో డైలాగ్ ఇప్పుడు నెట్టింట వైరల్. 'కాలా' తమిళ టీజర్ ను మీరూ చూడవచ్చు. ఈ వీడియోకు అప్పుడు 12.68 లక్షల వ్యూస్ వచ్చాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News