: యడ్యూరప్ప జయకేతనం
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎన్నికల్లో విజయం సాధించారు. తన నియోజకవర్గం శికారిపుర నుంచి 15 వేల ఓట్ల అధిక్యంతో నెగ్గారు. కేజేపీ పేరిట బీజేపీ నుంచి వేరు కుంపటి పెట్టుకున్న యడ్యూరప్ప తన పార్టీని గెలుపు పథంలో నడిపించడంలో విఫలమైనా, బీజేపీ ఓట్లను చీల్చడంలో మాత్రం సఫలమయ్యాడు. ఈ ఎన్నికల్లో కేజేపీ 6 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.