pm: అరబిందో ఆశ్రమాన్ని సందర్శించిన ప్రధాని మోదీ... కొన్ని నిమిషాలు పాటు మెడిటేషన్
- విమానాశ్రయంలో లెఫ్టినెంట్ గవర్నర్, సీఎంల స్వాగతం
- ఆశ్రమంలో అరబిందోకు ప్రధాని నివాళులు
- అనంతరం విద్యార్థులతో ముచ్చటింపు
ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు పుదుచ్చేరిలోని శ్రీ అరబిందో ఆశ్రమాన్ని సందర్శించారు. విమానాశ్రయంలో ఆయనకు లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ప్రధాని మోదీ అరబిందో ఆశ్రమానికి వెళ్లారు. ముందుగా శ్రీ అరబిందోకు నివాళులు అర్పించారు. అక్కడే కొన్ని నిమిషాల పాటు మెడిటేషన్ చేశారు. అనంతరం ఆశ్రమం ఆధ్వర్యంలో కొసాగుతున్న ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులతో ముచ్చటించారు. ఆ తర్వాత అరోవిల్లే ఇంటర్నేషనల్ టౌన్ షిప్ కు బయల్దేరి వెళ్లారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఉన్న ఈ టౌన్ షిప్ లో గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొననున్నారు.