prostitution: మసాజ్ ముసుగులో అనైతిక కార్యకలాపాలు.. గుట్టు రట్టు చేసిన పోలీసులు

  • మసాజ్ ముసుగులో వ్యభిచారం
  • గుంటూరులో వ్యభిచార ముఠా గుట్టు రట్టు
  • నిర్వాహకుడు, నలుగురు మహిళల అరెస్ట్

గుంటూరులో మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే, నగరంలోని లక్ష్మీపురంలో బౌన్స్ బ్యూటీ అండ్ మసాజ్ సెంటర్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నారంటూ అర్బన్ ఎస్పీకి పక్కా సమాచారం అందింది. దీంతో ఆ సెంటర్ పై నిఘా పెట్టిన పోలీసులు, ఒక్కసారిగా దాడి చేశారు.

ఈ దాడుల్లో నిర్వాహకుడు రామచంద్రరావుతో పాటు అతని అసిస్టెంట్, నలుగురు మహిళలు, ఒక విటుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 18 వేలతో పాటు, 11 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గత నాలుగేళ్ల నుంచి ఈ సెంటర్ ను రామచంద్రరావు నిర్వహిస్తున్నాడు. తొలుత ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి బ్యూటీ పార్లర్ ను నిర్వహించాడు. ఈ బిజినెస్ లో నష్టాలు రావడంతో, వ్యభిచారాన్ని ప్రారంభించాడు. పురుషులకు మహిళలతో మసాజ్ చేయించడమే కాకుండా, వ్యభిచారం కూడా నిర్వహిస్తున్నాడు. 

More Telugu News